తమన్నా కి గోల్డెన్ ఛాన్స్...ఫుల్ ఖుష్

By Srikanya

చెన్నై : ఇన్నాళ్లూ తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించిన తమన్నా త్వరలో తనలోని నటిని బయిటపెట్టనున్నది. దర్శకుడు బాలా చిత్రంలో ఆమె ఎంపికైంది. బాలా చిత్రాలంటే తెలుగు,తమిళ భాషల్లో ఉన్న క్రేజే వేరు. ఆయన తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. హీరోగా విశాల్‌ ని ఎంచుకున్నారు. మాస్ హీరో విశాల్ మరోసారి బాలా దర్శకత్వంలో నటించనున్నారు. ఆయనకు జంటగా తొలిసారి తమన్నా ఆడిపాడనుంది. దాంతో తమన్నాకు మంచి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

Tamanna

విశాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం 'అవన్‌-ఇవన్‌'(వాడు - వీడు). బాలా తెరకెక్కించిన ఇందులో మెల్లకన్నుతో నటించి తనలోని వైవిధ్య నటుణ్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి బాలా దర్శకత్వంలో కనిపించనున్నారీ టాల్‌హీరో. దీనికి సంబంధించిన చర్చలు కూడ వీరి మధ్య పూర్తయ్యాయని, త్వరలోనే సెట్స్‌పైకి చిత్రం వెళ్లనున్నట్లు సమాచారం.

తన గత చిత్రాలన్నీ వైవిధ్య కథలతో తెరకెక్కించిన బాలా... దీన్ని పూర్తిస్థాయి హాస్య ప్రధానంగా తీర్చిదిద్దనున్నారట. అందుకే ఇందులో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేశారని సమాచారం. హీరోకి తెరపై తిరుగులేని గుర్తింపు ఇస్తాడని దర్శకుడు బాలాకు పేరు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. సూర్య, విక్రం.. వంటి వారికి అలా మంచి సినీ జీవితాన్ని ప్రసాదించాడీ విలక్షణ దర్శకుడు. ప్రతిఒక్కరిలో అసలైన నటుణ్ని వెలికితీసే సత్తా ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం విశాల్ కు మరోసారి వరించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 'పరదేశి'తో మరో వాస్తవిక దృశ్యకావ్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X