twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాల ‘పరదేశి’ ఆడియో జూన్ 22న

    By Bojja Kumar
    |

    Bala's Paradesi
    హైదరాబాద్ : శివపుత్రుడు, నేనే దేవున్ని, వాడు-వీడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు బాలా తాజాగా 'పరదేశి' పేరుతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. బాలా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పరదేశి' చిత్రం ఆడియో జూన్ 22న విడుదల కానుంది. త్వరలో సినిమా తేదీ ఖరారు కానుంది. కిరణ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి.

    తమిళ నటుడు మురళి కుమారుడు అధర్వ హీరోగా చేస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్రానికి మునుపు 1937 ప్రాంతంలో చోటుచేసుకున్న యదార్థ ఘటనకు సంబంధించిన కథతో తెరకెక్కించారు. తేయాకు తోటల్లో పని చేయడానికి ఓ గ్రామంలోని మొత్తం జనాన్ని కూలీలుగా తీసుకెళ్లిన బ్రిటిష్ వారి ఆగడాలను కళ్లకు కట్టినట్లు వివరించే సినిమా ఇది. ఇప్పటికే తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

    సహజశైలిలో సాగే బాలా చిత్రాలకు తెలుగులో ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ ఏర్పడింది. అందుకే ఆయన చిత్రాలు మన దగ్గర క్రమం తప్పకుండా విడుదలవుతుంటాయి. తాజాగా 'పరదేశి' చిత్రం తెలుగులో రానుంది. వాస్తవానికి ఈ చిత్ర కథానాయకుడి పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. బాలా బ్రాండ్ సినిమాగా ఈచిత్రం తెలుగులో విడుదలవుతోంది.

    అధర్వ, వేదిక, ధన్షిక హీరో హీరోయిన్స్. ఉమా రియాజ్‌ఖాన్‌ కీలక పాత్రధారి. జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించాడు. అధర్వ వేషధారణ, బాలా రూపొందించిన తీరుకు విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి మాటలు : శశాంక్ వెన్నెల కంటి, పాటలు : చంద్రబోస్, సంగీతం : జీవి ప్రకాష్, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, సహ నిర్మాత : వై.శ్రీనివాస్, నిర్మాత : కిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బాల.

    English summary
    Paradesi audio releasing on June 22. The Tamil drama film written and directed by Bala starring Adharvaa, Vedhika and Dhansika in the lead. The film's music was scored by G. V. Prakash Kumar. The film is based on real life incidents that took place before independence in the 1937.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X