బాలచందర్ నా తండ్రి లాంటివారు: రజనీకాంత్

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణంతో ఆయన శిష్యుడు రజనీకాంత్ షాక్‌కు గురయ్యారు. రజనీ ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారకుడైన గురువు మరణం ఆయన్ను శోక సముద్రంలో మంచేసింది. ఈ సందర్భగా రజనీకాంత్ మాట్లాడుతూ బాలచందర్ నాకు గురువు మాత్రమే కాదు, తండ్రి లాంటి వారు అని వ్యాఖ్యానించారు. ఆయన నన్నెప్పుడూ నటుడిగా ట్రీట్ చేయలేదు, సొంత కొడుకులా చూసుకున్నారని రజనీకాంత్ తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్

84 సంవత్సరాల బాలచందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూసారు. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ తో పాటు అనేక మందిని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

 Balachander was my father: Rajinikanth

1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్.....చిత్రం ద్వారా రజనీకాంత్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. బాలచందర్‌తో కలిసి రజనీకాంత్ దాదాపు 10 చిత్రాల్లో పని చేసారు. బాలచందర్ తన కెరీర్లో 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X