Balagam నటుడు కన్నుమూత.. బాపూ అంటూ దర్శకుడు వేణు ఎమోషనల్

ఈ మధ్యకాలంలో కంటెంట్ బాగుంటే చాలు సినిమాలను అందలమెక్కిస్తున్నారు ప్రేక్షకులు. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ఒకటి బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో ఓ నటుడు మృతి చెందారు. దీనితో ఈ విషయాన్ని తెలియజేస్తూ... డైరెక్టర్ వేణు ఎల్దండి సోషల్ మీడియా ద్వారా ఎమోషల్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...

జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో బలగం సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను దిల్ రాజు... కేవలం రూ.4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ప్రియాదర్శి, కావ్య నటించారు. తెలంగాణ నేపథ్యంతో కూడిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.

Balagam Actor Narsingam Passes Away and Director Venu Yeldandi Emotional Tweet

బలగం సినిమాను పల్లెటూరి అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పు పొందుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలే కాకుండా... అంతర్జాతీయ అవార్డులు సైతం లభించాయి.

అయితే బలగం సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ... వేణు ఎల్దండి ఎమోషల్ అయ్యారు. వేణు తన సోషల్ మీడియా ఖాతా వేదికగా... మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి.. అంటూ రాసుకొచ్చారు.

Balagam Actor Narsingam Passes Away and Director Venu Yeldandi Emotional Tweet

ఇక బలగం సినిమా కోసం.. రీసెర్చ్ చేస్తున్నప్పుడు... మొదటగా నర్సింగం బాపునే కలిశానంటూ వేణు చెప్పుకొచ్చారు. అయితే ఆయన తన కోసం గుడాలు తెప్పించాడని వెల్లడించారు. ఇక ఆయన పలు అనారోగ్య కారణాల చేత చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి చెబుతున్నారు.

ఇక బలగం సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మించారు. సుధాకర్ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో దాదాపుగా ఆ షూటింగ్ జరిపిన ఊరి వారినే తీసుకున్నారు. ఈ క్రమంలోనే నర్సింగంను కూడా నటింప చేసినట్టు తెలుస్తోంది. ఆయన మృతితో వారి ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X