Balagam: ప్రభాసే కాదు 70 ఏళ్ల వ్యక్తి అయిన ఓకే.. బలగం నటి రూప లక్ష్మీ కామెంట్స్
జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
మార్చి 3న విడుదలైన బలగం సినిమా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తోపాటు విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. అయితే ఇందులో హీరోయిన్ కు తల్లిగా నటించిన నటి రూప లక్ష్మీ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తొలి రోజు నుంచి..
కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు ముఖ్య భూమిక పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి ప్రేక్షాకాదరణ పొందుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఎమోషనల్ కామెడీ డ్రామా..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కథతో రూపొందిన చిత్రం 'బలగం'. ఓ కుటుంబంలో పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని.. అంత్యక్రియలు, దశదిన కర్మ, పిట్టకు పెట్టుడు, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్థలు, భావోద్వేగాల వంటి అంశాలతో బ్యూటిఫుల్ ఎమోషనల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా వచ్చింది. మన ఇంట్లో కథ అన్నట్లుగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

నటనపరంగా ఒదిగిపోయి..
బలగం సినిమాకు మంచి మౌత్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్టు కొట్టింది. అంతేకాకుండా మార్చి 17న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా కోసం థియేటర్లలోకి ప్రేక్షకులు వచ్చారంటేనే చెప్పొచ్చు బలగం తెలుగు ఆడియెన్సుకు ఎంతలా కనెక్ట్ అయిందనేది. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ నటనపరంగా పాత్రల్లోకి ఒదిగిపోయారనే చెప్పొచ్చు.

స్నానం చేయించే సీన్..
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డితోపాటు రూప లక్ష్మీ, నక్కల మురళిధర్ గౌడ్ కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. సుధాకర్ రెడ్డి కూతురిగా, కావ్య కల్యాణ్ రామ్ కు తల్లిగా నటించి ఆకట్టుకున్నారు నటి రూప లక్ష్మి. ఆమె మరణించిన తండ్రికి కూతురిగా చేసిన పాత్రలో జీవించేశారు. ముఖ్యంగా తండ్రి శవానికి చివరిగా స్నానం చేయించే సీన్ లో అతన్ని హత్తుకుని ఏడ్చే సీన్ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. అంతలా ఆమె ఒదిగిపోయారు.

చిన్న వయసులోనే ఆ పాత్ర..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి రూప లక్ష్మి తన తల్లి పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. "మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను ఓ ఎకనమిక్స్ లెక్చరర్ కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి ఉంటాను" అని రూప లక్ష్మి తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే తల్లి పాత్రను పోషించారు కదా రేపు ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా చేయమని అడిగితే ఏం చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది.

70 ఏళ్ల వ్యక్తికి అయినా..
యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "మహిళ జీవితంలో సంతృప్తిగా ఉండే స్థానం ఏదంటే అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నేను నటించడానికి సిద్ధమే. నాకేం సమస్య లేదు. ప్రభాస్ అనే కాదు 70 ఏళ్ల వ్యక్తికి కూడా అమ్మగా నటించాలని అడిగినా నాకేం ప్రాబ్లమ్ లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని సీనియర్ నటి రూప లక్ష్మీ చెప్పుకొచ్చారు. కాగా నీది నాది ఒకే కథ, జాంబీ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, నర్తన శాల, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి తదితర చిత్రాల్లో నటించారు రూప లక్ష్మి.


Click it and Unblock the Notifications











