ఇండస్ట్రీలో మరో విషాదం.. బలగం నటుడు కన్నుమూత..

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. బలగం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున వరంగల్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అవిశ్వాస విడిచారు. మొగిలయ్యను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. మొగిలయ్య మరణం పట్ల బలగం మూవీ యూనిట్‌తో పాటుగా సీని,రాజకీయ పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ ఫ్రేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బలగం'. తెలంగాణ పల్లెటూరు వాతావరణం, బంధాలు బంధుత్వాలు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్లైమాక్స్ లో మొగిలయ్య తన పాటతో కోట్లాదిమంది ప్రేక్షకులను హృదయాలను టచ్ చేసారు. తన పాటతో బంధాలను, బంధుత్వాలను మానవ సంబంధాలను గుర్తు చేస్తూ కన్నీరు పెట్టించాడు. ఈ సినిమా ఒక ఎత్తు అయితే.. మొగిలయ్య పాట మరో ఎత్తు గా మారింది. క్లైమాక్స్ ను రసవత్తరంగా మార్చేందుకు ఆయన పాట ఎంతగానో దోహద పడిందనే చెప్పాలి.

Balagam fame artist Darshanam Mogilaiah passed away

బలగం సినిమా తర్వాత మొగిలయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో హాస్పిటల్ పాలయ్యారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయనకు చేయూతనిచ్చింది. మొగులయ్య డయాలసిస్ చేసుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో ఆనాటి మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సహాయం అందించారు.

ఈ తరుణంలో ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి బలగం డైరెక్టర్ వేణు బలగం చిత్ర యూనిట్ కూడా మొగిలయ్య కు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల మరోసారి మొగిలయ్య ఆరోగ్యం క్షీణించడంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. మొగిలయ్య మరణంతో ఇండస్ట్రీ ఓ మంచి కళాకారుడ్ని కోల్పోయిందని సంతాపం తెలుపుతున్నారు.

More from Filmibeat

Read more about: balagam mogilaiah
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X