Balagam Awards: బలగం కొమురయ్యకు ఇంటర్నేషనల్ అవార్డ్.. అంతర్జాతీయంగా పురస్కారాలు
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తున్నాయి. అలాంటి వాటిలో తాజాగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సినిమానే బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
ఇందులో కుటుంబ బంధాలు, అనురాగం, ఆప్యాయతలు వంటి సన్నివేశాలతో హృద్యంగా మలిచారు. దీంతో ఈ సినిమాకు అవార్డుల పంట మొదలైంది. తాజాగా రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుని సత్తా చాటింది.

కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, అపూర్వ లక్ష్మి, కేతిరి సుధాకర్ రెడ్డి, రచ్చ రవి ఇతరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీమైన ప్రేక్షకాదరణ లభించింది. అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా మారి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 3న విడుదలైన బలగం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
బలగం సినిమాకు ఇప్పటికే లాస్ ఏంజిల్స్ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారాలతోపాటు పలు అరుదైన సత్కారాలు వరించాయి. ఇటీవలే 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్ జ్యూరి క్యాటగిరీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారం దక్కింది. అలాగే తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పోలీస్ కానిస్టేబుల్ చివరి పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న రావడం విశేషంగా మారింది.
బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయ స్థాయిలో దక్కించుకుంది బలగం సినిమా. తాజాగా ఈ జాబితాలో మరో రెండు అవార్డ్స్ చేరాయి. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఉత్తమ నటుడు అవార్డ్ ప్రియదర్శకి రాగా.. ఉత్తమ సహాయ నటుడు అవార్డును కేతిరి సుధాకర్ రెడ్డిని వరించింది. ఇప్పటికీ ఈ ఫెస్టివల్ 2021 సంవత్సరంలో ఫహాద్ ఫాజిల్ జోజికి ఉత్తమ చిత్రంగా, గతేడాది మలయాళ చిత్రం నాయట్టుకు అవార్డ్స్ వచ్చాయి.
ఇప్పుడు స్వీడిష్ ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకున్న సినిమా జాబితాలో బలగం చేరింది. ఇందులో కొమురయ్య పాత్రలో కేతిరి సుధాకర్ రెడ్డి మంచి నటన కనబర్చారు. సినిమాలో ఆయన పాత్ర చనిపోయినప్పటికీ మూవీ మొత్తం ఆయన పాత్ర చుట్టూ తిరుగుతూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











