బలగం మొగిలయ్య పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు.. అసలు ఏమైందంటే?
తెలంగాణ పల్లె ప్రాంతాల్లోని జీవన విధానం, కుటుంబ బంధాలు, గొడవలు, చావు, పెద్దకర్మ వంటి తదితర అంశాలతో ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన చిత్రం బలగం. ఒక్క చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరినీ కదిలించింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లేలా చేసి రికార్డ్ సాధించింది.
అంతేకాకుండా బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ చిత్రంగా పలు ఇంటర్నేషనల్ అవార్డ్సును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే మూవీ క్లైమాక్స్ లో కుటుంబాన్ని మొత్తం కలిపేలా ఉండే పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట పాడిన మొగిలయ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ బంధాలు, ఆప్యాయతలు వంటి కథతో తెరకెక్కిన సినిమా 'బలగం'. ఓ కుటుంబంలో పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని.. అంత్యక్రియలు, దశదిన కర్మ, పిట్టకు పెట్టుడు, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్థలు, భావోద్వేగాల వంటి అంశాలతో బ్యూటిఫుల్ ఎమోషనల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను కమెడియన్ వేణు యెల్దండి తెరకెక్కించారు. మన ఇంట్లో కథ అన్నట్లుగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టగా పలు అవార్డులు సాధించి సత్తా చాటింది.
ఇక 'బలగం' సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే 'తోడుగా మా తోడుండి' అనే పాట ప్రతీ ఒక్కరిని ఏడిపిస్తుంది. ఈ పాటే సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచింది. అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మొగిలయ్యకు కరోనా వచ్చాక.. దాని ప్రభావంతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అలాగే కళ్లు కనపడక పోవడం, షుగర్, బీపీ కూడా రావడంతో ఆయన ఆరోగ్యం మరింత క్రిటికల్ గా మారింది.
గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలోనే మొగిలయ్యకు వైద్యులు డయాలిసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది.
దీంతో వైద్యులు మొగిలయ్యను మెరుగైన వైద్యం కోసం హైదరబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు.
ప్రస్తుతం బలగం గాయకుడు మొగిలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక మొగిలయ్య ఆరోగ్యంపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయకర్ రావు స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











