బాలయ్య ‘పరమ’డైలాగ్ మీకోసం...
నందమూరి బాలకృష్ణ హీరోగా.. దర్శకరత్న దాసరి 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన రీతిలో తెరకెక్కుతోన్న 'పరమవీరచక్ర" షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదట బాలయ్య యంగ్ గెటప్ లో పలు కీలక సన్నవిశేశాలు చిత్రీకరించిన దాసరి ప్రస్తుతం బాలయ్య మేజర్ గెటప్ తో పవర్ ఫుల్ సీన్స్ ని పిక్చరైజ్ చేస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 'పరమవీర చక్ర" షూటింగ్ జరుగుతున్నప్పుడు మేజర్ గా బాలకృష్ణ చెప్పిన ఓ డైలాగ్ మీకోసం...
'రేయ్..ఎంతమంది టెర్రరిస్ట్ లని చంపినా ఇంకా ఇంకా పుట్టుకొస్తూనే వున్నారా, అందుకే నేను టెర్రరిస్టులతో బాటు టెర్రరిజాన్నేచంపెయ్యడానికి వచ్చా" అంటూ బాలయ్ తనదైన శైలిలో ఈ డైలాగ్ పలకడం, ఆయన చెప్పిన తీరుకి ముగ్థులైర యూనిట్ మెంబర్స్ అందరూ క్లాప్స్ కొట్టెయ్యడం జరిగింది. అంతే కాదు..మేజర్ గెటప్ కోసం దాసరి రాసిన ప్రతీ డైలాగ్ ఇదే రేంజ్ లో వుందనీ, 'పరమవీర చక్ర" లోనూ బాలయ్య సింహంలా గర్జిస్తున్నారనీ అంటున్నారు ఆ టీమ్ మెంబర్స్.


Click it and Unblock the Notifications











