అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ హల్‌చల్ (ఫోటోలు)
హైదరాబాద్: ఇటీవల 'లెజెండ్' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో బాలయ్య అభిమానులు రచ్చ రంబోలా చేసిన సంగతి తెలిసిందే. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని సృష్టించారు. బాలయ్యకు ఫాలోయింగ్ కేవలం ఇక్కడ మాత్రమే కాదు....అమెరికాలోనూ ఉంది.
'లెజెండ్' సినిమా విడుదలను పురస్కరించుకుని అమెరికాలోని హోస్టన్‌లో అభిమానులు కార్ ర్యాలీ నిర్వహించారు. బాలయ్య ఫోటోతో కూడిన లెజెండ్ టీషర్టులను ధరించి ఫ్యాన్స్ హల్ చల్ చేసారు. యూఎస్‌లో నిర్వహించిన ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు.
యూఎస్‌లో బాలయ్య అభిమానులు చేసిన సందడికి సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో....

బాలయ్య ఫ్యాన్స్ కార్ ర్యాలీ
అమెరికాలోని హోస్టన్‌లో కార్ ర్యాలీ నిర్వహిస్తున్న బాలకృష్ణ అభిమానులు. బాలయ్య ఫోటో కూడిన టీషర్టులను ధరించి హల్ చల్ చేసారు.

బాలయ్య ఫ్యాన్స్
లెజెండ్ ప్రిమియర్ షోను పురస్కరించుకుని అభిమానులు సందడి చేసారు. సినిమా చూసేందుకు ఇలా ప్రత్యేకంగా డ్రెస్ కోడ్‌తో వెళ్లారు.

లెజెండ్
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా తెరకెక్కించిన ‘లెజెండ్' చిత్రం గ్రాండ్ విడుదలైంది. బాలయ్య అభిమానులు కోరుకునే కమర్షియల్ మసాలా అంశాలను బాగా దట్టించి ఈచిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి.

లెజెండ్ సూపర్ హిట్
బోయపాటి సినిమాల్లో పేలే పంచ్ డైలాగులు...ఈచిత్రంలో మరోసారి బాగా పేలాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ సినిమాలో జగపతి బాబు తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించాడు. ఇందులో జగపతి బాలయ్య హీరోయిజానికి ధీటుగా క్రూరమైన విలనిజాన్ని పండించారు. బాలయ్య సరసన సోనాల చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











