»   » బాలయ్య ఇన్విటేషన్: కేసీఆర్, బాబులను సంబోధించిన తీరు చూసారా!

బాలయ్య ఇన్విటేషన్: కేసీఆర్, బాబులను సంబోధించిన తీరు చూసారా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో 100వ చిత్రానికి చేరుకున్నారు. తన సినీ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బాలయ్య. రోటీన్ సినిమాలకు భిన్నంగా బాలయ్య ఈచిత్రాన్ని ఎంచుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం 'అమరావతి'ని పాలించిన గౌతమ్ పుత్ర శాతకర్ణి జీవితంగా ఆధారంగా తెరకెక్కుతోంది.

ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ 'నా వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాను. మన తెలుగు జాతి వారందరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి గౌతమీ పుత్ర శాతకర్ణి. భారతదేశానంతటినీ ఏక చత్రాధిపత్యం క్రింద పాలించిన చక్రవర్తి. ఆయన పాత్రలో నేను నటించనుండటం అదృష్టం' అని తెలిపారు.

ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళే ముహూర్తపు తేదిని ఫిక్స్ చేసారు. ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 22న ఉదయం గం.10:27ని.లకు ఈ లాంఛింగ్ కార్యక్రమం భారీ ఎత్తున జరగనున్నట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వనితులుగా తెలంగాణ సిఎం కేసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరికి బాలయ్య ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపారు.

బాలయ్యఈ ఇన్విటేషన్లో కేసీఆర్, చంద్రబాబులను సంబోధించిన తీరు భిన్నంగా ఉంది. అమ్మణమ్మ పుత్ర అంటూ చంద్రబాబును..... వెంకటమ్మ పుత్ర అంటూ చంద్రబాబు సంబోధించారు. ఇద్దరినీ మిత్రమా అంటూ ఆప్యాయంగా పలకిస్తూ ఆహ్వానం పంపారు.

చంద్రబాబును..

చంద్రబాబును..


ఏపీ సీఎం చంద్రబాబును అమ్మణమ్మ పుత్ర అంటూ ఇన్విటేషన్లో సంబోధించిన బాలయ్య.

కేసీఆర్ ను...

కేసీఆర్ ను...


తెలంగాణ సీఎం కేసీఆర్ ను వెంకటమ్మ పుత్ర అంటూ ఇన్విటేషన్లో సంబోధించిన బాలయ్య.

ఇన్విటేషన్ వివరాలు..

ఇన్విటేషన్ వివరాలు..


అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 22న ఉదయం గం.10:27ని.లకు ఈ లాంఛింగ్ కార్యక్రమం భారీ ఎత్తున జరుగబోతోంది.

ఇట్లు

ఇట్లు


మీ ఆగమ నిలయ, మేరు నగధీర
సమర శిరసి విజితంపు సంఘాత
పరవారణ విక్రమ నారసింహ
రాజ రాజ
శ్రీశ్రీశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి

కేసీఆర్ కు ఇన్విటేషన్

కేసీఆర్ కు ఇన్విటేషన్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇన్విటేషన్ అందిస్తున్న బాలయ్య. పక్కనే దర్శకుడు క్రిష్.

English summary
Nandamuri Balakrishna and his director Krish today met Telangana Chief Minister K Chandrasekhar Rao at his camp office to invite him to the movie launch. Balakrishna's 100th movie titled 'Gauthamiputra Satakarni' in the direction of Krish will be launched at Annapurna Studios on 22nd April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu