అదిరింది: బాలయ్య 100వ సినిమా టైటిల్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: ‘సింహా', ‘లెజెండ్', ‘లయన్'....ఇలా ఈ మధ్య కాలంలో సినిమా టైటిల్స్ అన్నీ బాలయ్య ఇమేజ్‌కు పర్ ఫెక్టుగా సూటయ్యే విధంగా ఉంటున్నాయి. త్వరలో బాలయ్య తన కెరీర్లో 100వ సినిమా మైలురాయిని అందుకోబోతున్నారు. మరి బాలయ్య 100వ సినిమా అంటే ఎలా ఉండాలి? అదరి పోవాలి...టైటిల్ ఇప్పటి వరకు వచ్చిన టైటిల్స్ అన్నింటికీ ధీటుగా, బాలయ్య కెరీర్‌కు అద్దం పట్టే విధంగా ఉండాలి. అందుకే ఈ చిత్రానికి ‘చరిత్రకొక్కడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమారారం. బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను ఈ వందవ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. లెజెండ్ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

బాలయ్య తాజా సినిమా ‘లయన్' విషయానికొస్తే...ఈ చిత్రం మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.

Balakrishna 100th Movie Title as Charitraku Okkadu

బాలయ్య నటించిన గత చిత్రం ‘లెజెండ్' భారీ హిట్టయిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పబ్లిసిటీ జోరు పెంచారు. సినిమాకు సంబంధించిన సరికొత్త స్టిల్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల శిల్పకళా వేదికలో జరిగిన ‘లయన్' ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో పంక్షన్ గ్రాండ్ గా జరిగింది. నిర్మాత రమణారావు మాట్లాడుతూ...ఈ చిత్రంలో బాలయ్య గారి పాత్రను దర్శకుడు సత్యదేవ మలిచిన తీరు, ఆయన చేత పలికించిన సంబాషణలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. బాలకృష్ణ-మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న మరో మ్యూజికల్ సెన్నేషన్ హిట్ ఈ సినిమా' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X