బాలయ్య సెంటిమెంట్ తప్పలేదు: మళ్ళీ సింహమే

బాలకృష్ణ సినిమాలకు సింహ అనేది బాగా కలిసి వస్తుండటంతో ఈ టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని చాలామంది ముందునుంచీ అనుకుంటూనే ఉన్నారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాక పోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రానికి 'జయ సింహ' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తర్వాత అది కాదు.... 'ఎన్‌బికె కర్ణ' అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Recommended Video

Balakrishna Need Three Heroines - Filmibeat Telugu
సెంటిమెంట్

సెంటిమెంట్

సెంటిమెంట్లను నమ్మడంలో మన సినిమా ఇండస్ట్రీ లో బాలయ్య ముందుంటాడు. ఆయన చేసే ప్రతీపనిలోనూ ఈ సెంటిమెంట్ అనేది ధ్వనిస్తుంది. పైగా సెంటిమెంట్ అనేది కూడా మన సంస్కృతిలో భాగం అని ఆయన నమ్ముతుంటారు. అందుకే ఇప్పుడు తన కొత్త సినిమాపై ఆ సెంటిమెంట్ ను తప్పటం లేదు.

 పైసా వసూల్

పైసా వసూల్

అసలు 'పైసా వసూల్' ఫ్లాప్ అవుతుందని బాలయ్య అనుకోలేదు. ఆ పంచులూ ఆ సెటైర్లు అలాగే కొత్తగా కనిపిస్తున్న తన బాడీ లాంగ్వేజ్ బాగా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు. కాని అది ఆడకపోయేసరికి.. కె ఎస్ రవికుమార్ డైరక్షన్లో చేస్తున్న 102వ సినిమాకు అన్నీ సెంటిమెంట్లను అద్దేస్తున్నారు.

జయ సింహ' ఫైనల్

జయ సింహ' ఫైనల్

‘జయ సింహ' ఫైనల్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలకృష్ణ సినిమాలకు సింహ అనేది బాగా కలిసి వస్తుండటంతో ఈ టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని చాలామంది ముందునుంచీ అనుకుంటూనే ఉన్నారు. రెడ్డి, సింహా.. రెండూ బాల‌య్య‌కు అచ్చొచ్చిన టైటిళ్లే.

 జయ సింహా

జయ సింహా

ఆల్రెడీ ఈ సినిమాలో తనకు హిట్ సెంటిమెంట్ అయిన నయనతార ఉంది. అలాగే తనకు అచ్చొచ్చేలా ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు తనకు ఎంతగానో కలిసిచ్చిన సింహా అనే పదం ఉన్న.. ''జయ సింహా'' అనే టైటిల్ నే ఈ సినిమాకు ఖరారు చేశారట.

 సింహా సెంటిమెంట్

సింహా సెంటిమెంట్

స‌మ‌ర‌సింహారెడ్డి బాల‌య్య కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా. చెన్న‌కేశ‌వ రెడ్డి కూడా బాగానే ఆడింది. ఇక సింహా సెంటిమెంట్ గురించి చెప్ప‌క్క‌ర్లేద్దు. ల‌క్ష్మీ న‌ర‌సింహా, సింహా, న‌ర‌సింహానాయుడు ఇలా దాదాపుగా సింహా పేరు వాడిన‌ప్పుడ‌ల్లా బాల‌య్య హిట్లు కొట్టాడు.

నయనతార, హరిప్రియ, నతాషా

నయనతార, హరిప్రియ, నతాషా

సీ.కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు నయనతార, హరిప్రియ, నతాషా వంటి తారలు కనిపించనున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన చిరంతన్ భట్ ఈ సినిమాకు కూడా పనిచేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X