Balakrishna 50 years:మోక్షజ్ఞ ఎంట్రీ ఆ రోజునే.. నందమూరి ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్

నందమూరి ఫ్యామిలీ నుంచి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వంటి హీరోలు యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ముగ్గురూ ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో నందమూరి అభిమానులను ఖుషీ చేసే కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రాబోతున్నాయి.

నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరంగేట్రం చేసిన 'తాతమ్మ కల' చిత్రం 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ సినిమా వచ్చి యాభై ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, తెలుగు చిత్ర పరిశ్రమ బాలయ్యను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో NBK 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే వేదిక మీద నందమూరి వారసుడి డెబ్యూ గురించి అధికారిక ప్రకటన చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Balakrishna 50 years in Telugu Film Industry Triple treat for Nandamuri fans and Mokshagna coming with crazy updates

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మెగా, అక్కినేని, దగ్గుబాటి వారసులంతా హీరోలుగా తెరంగేట్రం చేయడంతో.. వీలైనంత త్వరగా బాలయ్య తనయుడిని సినిమాల్లోకి తీసుకురావాలని వారంతా కోరుకున్నారు. కానీ ఎందుకనో తెలియదు మోక్షు డెబ్యూ లేట్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు అతని ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. 'హను-మాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా తన డెబ్యూ ప్రాజెక్ట్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బర్త్ డే స్పెషల్ గా ప్రీ లుక్ లేదా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర 1' సినిమా సెప్టెంబర్ నెలాఖరున 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Balakrishna 50 years in Telugu Film Industry Triple treat for Nandamuri fans and Mokshagna coming with crazy updates

బాలకృష్ణ 50 ఇయర్స్ ఇండస్ట్రీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్, ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజ్.. ఇలా సెప్టెంబర్ నెలలో నందమూరి ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ లభించనుంది. అలానే మధ్యలో బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 'NBK 109', కల్యాణ్ రామ్ చేస్తున్న 'NKR 21' సినిమాల అప్డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న 'NTR 31' చిత్రాన్ని ఆగస్టు 9న అఫిషియల్ గా లాంఛ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. సో ఏడాది చివరి వరకూ సెలబ్రేట్ చేసుకోడానికి అభిమానులకు కావాల్సినంత కంటెంట్ దొరుకినట్లే అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X