ఆ యంగ్ హీరో సినిమా లో బాలకృష్ణ గెస్ట్ రోల్ కన్ఫర్మ్!!

By Srikanya

నందమూరి బాలకృష్ణ త్వరలో మంచు మనోజ్ తాజా చిత్రం ఊ కొడతారా...ఉలిక్కి పడతారా లో గెస్ట్ గా కనిపించనున్నారు. సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర కీలకమైన పాత్ర ఇది. ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ చిత్రం. మనోజ్ మీద బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకమైన ఆపేక్షతో ఈ చిత్రంలో చేయటానకి ఒప్పుకున్నారు. అలాగే దర్శకుడు చెప్పిన కథ పూర్తిగా విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు.అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X