శాతకర్ణి... ఆ విమర్శపై నిజాయితీగా స్పందించిన బాలకృష్ణ
హైదరాబాద్: బాలయ్య ఏం చేసినా నిక్కచ్చిగా ఉంటుంది, ఆయన మాట ముక్కు సూటిగా ఉంటుంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడం ఆయనకు చేతకాదు.... అనేది ఆయనకు సన్నిహితంగా మెలిగేవారు, అభిమానులు అనే మాట.
తాజాగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా విషయంలోనూ బాలయ్య తనదైన వ్యక్తిత్వం ప్రదర్శించారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు జాతి ఖ్యాతిని చాటిచెప్పే విధంగా ఉందనే ప్రశంసలు అందుకుంటోంది. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రకు బాలయ్య తప్ప మరెవరూ సాటిరారు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నమాట.

అన్నీ బాగానే ఉన్నా.... సినిమాలో కథ విషయంలో ఏదో లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుందనే ఓ చిన్న విమర్శ బయటకు వచ్చింది. సినిమాలో శాతకర్ణి జాతిని ఏకం చేందుకు యుద్ధాలు చేయడం తప్ప ఆసక్తికర కథాంశం ఏమీ లేదు.
ఈ విషయంపై బాలయ్య స్పందించారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో కథ పరంగా పెద్దగా చెప్పుకోదగినది ఏమీలేదు. శాతకర్ణి చరిత్ర గురించి ఆధారాలు కూడా పెద్దగా లేవు. దొరికిన కొద్దిపాటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను తీసాం. క్రిష్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని బాలయ్య తెలిపారు.


Click it and Unblock the Notifications











