గాయం, 100వ సినిమా గురించి బాలయ్య ఇలా...
హైదరాబాద్: నందమూరి నట సింహం ఇటీవల సినిమా షూటింగులో గాయపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో బాలయ్య ఈ గాయంపై స్పందించారు. బైక్ పై నుండి పడటంతో గాయమైనట్లు తెలిపారు. 7 కుట్లు వేసారని, ప్రతి సినిమాకు గాయం ఒక గుర్తుగా మిగిలి పోతుందని తెలిపారు.
తన 100వ సినిమాపై స్పందిస్తూ.....సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని, అంచనాలకు తగిన విధంగానే 100వ సినిమా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 100వ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.

బాలయ్య తాజా సినిమా వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బాలయ్య సరసన త్రిష కథనాయికగా నటిస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సమక్షంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్య డూప్ లేకుండా...చాలా రీస్కీ ఫైట్స్ చేస్తూ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కళ: రవీందర్, కార్యనిర్వాహక నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాత: రుద్రపాటి రమణారావు, రచన-దర్శకత్వం: సత్యదేవ.


Click it and Unblock the Notifications











