ఆమె భర్తగా నాకు విపరీతమైన గౌరవం: బాలకృష్ణ

By Srikanya

హైదరాబాద్ : వసుంధరాదేవిని పెళ్లాడిన తొలినాళ్లల్లో కొత్త సంక్రాంతికి సందడే సందడి! భోగి రోజునతెల్లవారుజామునే నిద్రలేపి.. సంప్రదాయబద్ధంగా.. వారి కుటుంబ ఆచారప్రకారం.. కొబ్బరి నూనె, నలుగు పెట్టి నదీ జలాలతో స్నానం చేయించేవారు. కొత్త అల్లుడు వారికి దైవంతో సమానమంట. ఎందుకంటే ఆడపడుచు వారి ఇంట సిరులు కురిపించే మహాలక్షీ అని వారి నమ్మిక. అందుకే ఆమె భర్తగా నాకు విపరీతమైన గౌరవం అంటూ సంక్రాంతి సందర్బంగా నందమూరి బాలకృష్ణ తన తొలి నాటి ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు.

అలాగే..తూర్పుగోదావరి అంటేనే సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక వాళ్ల మర్యాదలకు ఎవరూ తట్టుకోలేరు. వాళ్లు పెట్టే తినుబండారాలే కాదు వారి చూపే ఆప్యాయతకే కడుపు నిండిపోతుంది. . పిండివంటలు, కొత్త బట్టలు, ఇక వీధుల్లో పతంగలు సరదాగా గడిచిపోయేది. ఇక మా తోడల్లుడు ప్రసాద్‌, మా సతీమణులతో కలిసి రాజమండ్రి, రామచంద్రాపురం, మండపేటల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లం అని చెప్పారు.

ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గోదావరి జిల్లా అల్లుడే. రామచంద్రాపురం సమీపంలోని చెల్లూరు గ్రామానికి చెందిన దేవరపల్లి సూర్యారావు, ప్రమీల దంపతుల చిన్నల్లుడే మన హీరో! కాల క్రమంలో వ్యాపార రీత్యా ఆయన అత్తామామలు కాకినాడకు వెళ్లిపోయారు. 1982 నుంచి పెళ్త్లెయిన తరువాత మూడేళ్లు బాలకృష్ణ పండుగ రోజుల్లో ఇక్కడే గడిపేవారు. సినిమాలతో బిజీ.. అభిమానుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పండుగలో ఏదో ఒకరోజు వచ్చి సరదాగా గడిపి ఇక్కడ పుణ్యక్షేత్రాలను సందర్శించి వెళ్తుంటారు.

ప్రస్తుతం బాలకృష్ణ తన సంక్రాంతి సంబరాలను వియ్యంకుడు ఇంట్లో జరుపుకుంటున్నారు. శనివారం రాత్రి నారావారిపల్లిలోని బావ చంద్రబాబు ఇంటికి చేరుకున్న బాలయ్య అభిమానులతో కరచాలనం, నమస్కారాలు చేస్తూ సందడిగా కనిపించారు. అభిమానులు, పల్లెప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లిలో శనివారం నారా, నందమూరి కుటుంబసభ్యులు సందడిచేశారు. వీరి రాకతో గ్రామంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించింది. శనివారం మధ్యాహ్నానికే నందమూరి, నారా కుటుంబ సభ్యులు పల్లెకు చేరుకున్నారు. రాత్రికి బాలయ్య వచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X