»   » అత్తగారు అయ్యో అనుకున్నారు: ఇంకా భార్య గురించి బాలయ్య చెప్పిన విషయాలు!

అత్తగారు అయ్యో అనుకున్నారు: ఇంకా భార్య గురించి బాలయ్య చెప్పిన విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అత్తగారి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ సారి బాలయ్య సినిమా షూటింగులో భాగంగా రిక్షా తొక్కుతుంటే వాళ్ల అత్తగారు(బాలయ్య భార్య వసుందర దేవి తల్లి) ఆయన్ను చూసి అది సినిమా షూటింగ్ అని తెలియక చాలా బాధ పడిందట.

ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన సంఘటన గుర్తు చేసుకున్న ఆయన అప్పట్లో తాను షూటింగులో పాల్గొంటే పరిస్థితి ఎలా ఉండేదో వివరించారు. అంతే కాకుండా భార్య వసుంధర దేవి గురించి ఎంతో గొప్పగా చెప్పారు బాలయ్య.

అత్తగారి సంఘటన గురించి మాట్లాడుతూ 'చిన్నపుడు రామ్ రహీమ్ షూటింగులో భాగంగా కాకినాడ రిక్షా తొక్కే సీన్ చేసారు. ఎన్టీఆర్ గారి అబ్బాయిని కావడంతో జనం మేడలు.. మిద్దెలు ఎక్కి చూసేవాళ్లు. ఆ సమయంలో మా ఆవిడ వాళ్లమ్మ కూడా నన్ను చూశారట. అయ్యో రామారావుగారి అబ్బాయికి ఎంత కష్టమొచ్చింది.. రిక్షా తొక్కుతున్నాడే అనుకున్నారట. అప్పటికి వాళ్లకు మాకు ఏ సంబంధం లేదు. ఆశ్చర్యకరంగా వాళ్లింటికే నేను అల్లుడిగా వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా విధి లిఖితం' అని బాలయ్య చెప్పుకొచ్చారు.

Balakrishna about his wife Vasudhara Devi

భార్య వసుంధర గురించి మాట్లాడుతూ...'పేరుకు తగ్గట్లే ఆమెకు ఓర్పు ఎక్కువే. మా అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయనిపిస్తుంది. ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది. ఒక్కోసారి షూటింగు బిజీలో పిల్లల సరదాలు, గిఫ్టుల విషయం మరిచిపోతాను. ఆ విషయంలో పిల్లలు బాధ పడకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. నాకేదైనా సమస్య వస్తే పరిష్కారం వెతకడానికి తపిస్తుంది. నిజంగా వసుంధర నాకోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. ఆమె నా భార్య కావడం నా అదృష్టం. నేను లెక్కల్లో పూర్... అందు వల్ల ఇంట్లో ఆర్థిక విషయాలు సహా అన్నీ తనే చూసుకుంటుంది' అని బాలయ్య చెప్పుకొచ్చారు.

బాలయ్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. అయితే షూటింగ్ గ్యాప్ ఉండటంతో ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తన తల్లిపేరుతో నిర్వహిస్తున్న బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి కోసం నిధుల సేకరణ బిజీగా ఉన్నారు.

English summary
Tollywood actor Balakrishna talk about his wife Vasudhara Devi in recent interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu