బోయపాటితో చేస్తున్న చిత్రం కథ గురించి బాలకృష్ణ
అలాగే ఇక నుంచి రాజకీయ రంగంలో చురుకుగా పాలు పంచుకుంటానని, తెలుగుదేశం క్రియాశీల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని దీని వల్ల తన నట జీవితానికి ఏ విధమైన ఆటంకం ఏర్పడదని, నటుడిగా కొనసాగుతానని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. డల్లాస్ నగరంలో నిర్వహిస్తున్న నాట్స్ సంబరాల్లో భాగంగా ప్రవాసాంధ్రులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు.
ఇక తన కుమారుడు మోక్షజ్ఞ బి.బి.ఎం. చదువుతున్నాడని, నాలుగేళ్ల వరకు చదువులో కొనసాగుతాడని, ఆసక్తిని బట్టి తన భవిష్యత్తు తానే నిర్ణయించుకుంటాడని బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి అవుతారా అని అడిగిన ప్రశ్నకు దీని గురించి ఏమీ ఆలోచించలేదన్నారు. తెదేపాని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని ప్రవాసాంధ్ర మహిళ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ చిరునవ్వే సమాధానమైంది.
ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నేటి యువతరానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామని తెలిపారు. నటి సౌందర్య మృతితో నర్తనశాల చిత్రీకరణ నిలిచిపోయిందని, అర్జునుడు, బృహన్నల, కీచకుడి పాత్రల్లో త్రిపాత్రాభినయం చేయాలన్న తన కోరిక కలగానే మిగిలిపోయిందని బాలకృష్ణ అన్నారు. ద్రౌపది పాత్రకు తగిన నటి కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications












