హైట్ తక్కువ ఉండటం వల్లనే : బాలకృష్ణ
హైదరాబాద్ : నర్తనశాల కోసం ద్రౌపతి కోసం వెతుకుతున్నాం. నిత్యా కొంచెం హైట్ ఉండుంటే నా సినిమాలో ద్రౌపతిగా అవకాశం ఇచ్చే వాళ్లం. ఆమె అచ్చమైన తెలుగుమ్మాయిలా ఉందది....అంటూ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి వ్యాఖ్యానించారు హీరో బాలకృష్ణ అన్నారు. ఆదివారం జరిగిన నారా రోహిత్ తాజా మూవీ 'ఒక్కడినే' ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ పై విధంగా స్పందించారు. నిత్యా మీనన్ సౌందర్య, సావిత్రి లాంటి నటి, నంది అవార్డు కూడా పొందింది అంటూ కొనియాడారు.
ఆడియో రిలీజ్ డిటేల్స్ లోకి వెళితే...నారా రోహిత్, నిత్యా మీనన్ నటీనటులుగా గులాబీ మూవీస్ బేనర్ పై నిర్మాత సి.వి.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రోహిత్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ఆడియో ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీలను ఆవిష్కరించిన బాలకృష్ణ తొలి సీడీని కృష్ణం రాజుకు అందజేసారు.
నారా రోహిత్ గురించి మాట్లాడుతూ...సోలో చిత్రంతో రోహిత్ మంచి నటుడిగా పేరొందాడు. ఒక్కడినే అంటూ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. ఈచిత్రం రోహిత్ కు ప్లస్సవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా నాగబాబు, సాగర్, ప్రసన్న కుమార్, కెఎస్ రామారావు, అశోక్ కుమార్, కృష్ణం రాజు, గోపీనాథ్, జీవీ ప్రకాష్ నాయుడు, భాస్కభట్ల, రామజోగయ్య శాస్త్రి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











