సినిమా ఎప్పుడు ముగిసిందో తెలియలేదు: బాలకృష్ణ
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా ఎప్పుడు ముగిసిందో తెలియలేదు. షూటింగ్ అంత బాగా జరిగింది. ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా... అని ఎదురుచూస్తున్నారు. మాక్కూడా అంతే ఆసక్తిగా ఉంది. ఒక మంచి చిత్రంలో నటించిన తృప్తి లభించింది. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సాయిబాబు ఈ చిత్రాన్ని రాజీపడకుండా తీశారు అంటూ స్పందించారు బాలకృష్ణ. బాలకృష్ణ,నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం' . ఈ చిత్రం విడదల తేదిని ప్రకటించటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు నిర్మాతలు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఇలా స్పందించారు. అలాగే ..బాపురమణగార్ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇళయరాజాగారి నుంచి బాపుగారు మంచి బాణీలు రాబట్టుకున్నారు. బాపుగారి దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ చేశాను. ఆయన్నంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు. అద్భుతమైన కథతో రూపొందిన ఈ చిత్రం అందరి అంచనాలను చేరుకునే విధంగా ఉంటుంది. నవంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం అన్నారు.
ఇక నిర్మాత..సాయిబాబు మాట్లాడుతూ ప్లాన్ చేసిన ప్రకారమే ఈ చిత్రం షెడ్యూల్స్ జరిగాయి. ఆ భగవంతుడే మాతో ఈ సినిమా చేయించాడు. వెంకటరమణగారు లేని లోటు తప్ప ఈ చిత్రం మిగతా అన్ని రకాలుగా పూర్తి సంతృప్తినిచ్చింది. ఈ చిత్రవిజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు. ఇది అరుదైన సినిమా అని, ఇలాంటి సినిమాలో పని చేసే అవకాశం రావడం పుణ్యఫలం అని కోడెరైక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో బాపు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధానిబుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం అని చెప్పకొచ్చారు.


Click it and Unblock the Notifications











