బాలకృష్ణ హీరోగా చౌదరి అనే సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణతో వీరభద్ర అనే సినిమాను చేసిన రవికుమార్ చౌదరి సినిమాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరభద్ర సినిమా సరిగా ఆడకపోయినప్పటికీ రవికుమార్ పనితనం బాలకృష్ణకు నచ్చిందట. దాంతో చౌదరి సినిమా చేయడానికి ఆయన అంగీకరించారని వినికిడి. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న పాండురంగ చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సాధు సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించారు. రవికుమార్ దర్శకత్వం వహించే చౌదరి సినిమా సాధు కన్నా ముందు ఉంటుందా, తర్వాత ఉంటుందా అనేది తెలియడం లేదు.