అధినాయకుడు ఆడియోకు డేట్, స్పాట్ ఫిక్స్
బాలయ్య తాజా సినిమా 'అధినాయకుడు' సినిమాకు విడుదల తేదీ, వేదిక ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే తెలిపిననిర్మాతలు ఈ నెల 29న శిల్ప కళా వేదికలో సినిమా ఆడియో విడుదల కార్య్రకమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
బాలకృష్ణ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఓల్డ్ మేన్ గెటప్ తో పాటు తండ్రి, కొడుకు గెటప్ లోనూ బాలయ్య కనిపించనున్నారు. బాలయ్య ఓల్డ్ మేన్ గెటప్ కి జోడీగా జయసుధ, లక్ష్మి రాయ్, సలోని మిగిలిన రెండు పాత్రలకు జోడీగా నటిస్తున్నారు.
పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కళ్యాణి మాణిక్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని, త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయనున్న బాలయ్యకు ఈ సినిమా ప్లస్సవుతుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











