బాలకృష్ణ'అధినాయకుడు'విడుదల తేదీ ఖరారు
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం చాలా కాలంగా ఎప్పుడు రిలీజా అని అందరినీ ఊరిస్తోంది. మొత్తానికి ఈ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేయటానికి తేదిని ఫిక్స్ చేసారు. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ...షూటింగ్ మొత్తం పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మార్చి 23న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణ అభిమానలుకు మాత్రమే కాక అందరికీ నచ్చే చిత్రం ఇది అన్నారు. అలాగే... కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











