కర్నూల్ లో బాలకృష్ణ అధినాయకుడు..?!
నందమూరి బాలకృష్ణ కర్నూలు వెళ్లారు. ఆయన కథానాయకుడుగా, ఛార్మి, సలోని కథానాయికలుగా పరుచూరి మురళి డైరెక్షన్లో రూపొందుతున్న 'అధినాయకుడు' సినిమా షూటింగు ఈ రోజు(20.09.11) నుంచి అక్కడ జరుగుతుంది. ఈ భారీ షెడ్యూలులో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. బాలకృష్ణతో బాటు ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని కీర్తి కంబైన్స్ బ్యానర్ పై కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం కోసం హైదరాబాదు కోకాపేటలో ఓ పాటను చిత్రీకరించారు.
ఇదిలా ఉంచితే, ఈ షూటింగ్ పూర్తయ్యాక మంచు మనోజ్ హీరోగా మంచు లక్ష్మీ ప్రసన్న'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' సినిమా షూటింగులో బాలయ్య పాల్గొంటారు. మంచు మనోజ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం విధితమే. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో గాంధర్వ మహల్ సెట్లో జరుగుతోంది. పాత్ర నచ్చడం వల్లే బాలకృష్ణ ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడనే వార్తలు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె ఓ నెగటివ్ క్యారెక్టర్ పోషిస్తోంది. మిరకపకాయ్ హీరోయిన్ ధీక్షా సేథ్ హీరోయిన్ గా నటిస్తోంది.
బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన పౌరాణిక చిత్రం 'శ్రీరామ రాజ్యం" హంగేరి రాజధానిబుడాఫెస్ట్ లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు, రీరికార్డింగ్ కార్యక్రమాలు, మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ కూడా ముగించి అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











