బాలయ్య ‘అధినాయకుడు’ షూటింగ్ విశేషాలు
హీరో బాలకృష్ణ త్వరలో 'అధినాయకుడు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వీలు కాక వాయిదా వేశారు. సంక్రాంతికి ఆడియో, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎల్.కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన లక్ష్మి రాయ్, సలోని నటిస్తుండగా...జయసుధ ముఖ్యమైన రోల్ పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన బాలయ్య 'శ్రీరామ రాజ్యం' మంచి విజయమే సాధించినప్పటికీ....బాలయ్య అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు లేక పోవడంతో పెద్దగా వసూళ్లు సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో అభిమానులకు పూర్తి విందులా రూపొందుతున్న 'అధికాయకుడు' సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











