కత్తి పట్టకంటూ బాలకృష్ణ ఎడ్వైజ్
మంచి ప్రయత్నం చేశావు. వెంటనే యాక్షన్ అని కత్తిపట్టకు. అన్ని రకాల సినిమాలూ చెయ్యి అంటూ జయీభవ చిత్రం చూసిన బాబాయ్ బాలకృష్ణ స్పందిచారంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.అలాగే నటుడిగా నాకు 'జయీభవ' మంచి చిత్రం. ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో నేను తీసే తర్వాతి చిత్రాలు కూడా వైవిధ్యంగానే ఉంటాయి. మూస పద్ధతిలో చేయను. బాబాయ్‌తో మా బ్యానర్‌లో సినిమా చేద్దామని కొన్నాళ్ళు కథా చర్చలు చేశాం. కానీ అనుకున్నంత బాగా కుదర్లేదు. మాకు బాగా నచ్చిన స్క్రిప్టు దొరికితే వెంటనే ప్రారంభిస్తాం అన్నారు.
ఇక జయీభవ చిత్రం వర్కవుట్ అవకపోవటం గురించి మాట్లాడుతూ..నా గత చిత్రాల్లో యాక్షన్, సస్పెన్స్ వంటి అంశాలు ఎక్కువగా ఉండేవి. 'అతనొక్కడే', 'హరేరామ్' ఆ తరహాలోనే సాగుతాయి. వాటన్నింటికీ భిన్నంగా ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ చిత్రంగా 'జయీభవ'ను తీశాం. ఎక్కడా ద్వంద్వార్థాలుండవు. ఆహ్లాదకరంగా ఉంటుంది. మల్టీప్లెక్స్‌ల్లో మహిళలు, పిల్లలు అందరూ కలిసి నా సినిమాను చూస్తుండటం ఇదే తొలిసారి. యాక్షన్ అంశాలు తక్కువగా ఉండటం అభిమానులను కాస్త నిరాశపరచిన మాట వాస్తవమే. అయినా వారు కూడా ఈ కొత్త పంథాను మెల్లగా జీర్ణించుకుంటున్నారు అన్నారు కళ్యాణ్ రామ్.


Click it and Unblock the Notifications











