బాలయ్యలో ఏంటో ఆ రెండు కోణం
హైదరాబాద్ : వరస పెట్టి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి...ఆ వేడీ మెల్లిగా తగ్గింది. ఇప్పుడు అందరి దృష్టీ మరో పెద్ద హీరో సినిమాపై పడింది. అది మరోదో కాదు బాలకృష్ణ తాజా చిత్రం. 'లెజెండ్'తో ఫ్యాన్స్ ని అలరించిన నందమూరి బాలకృష్ణ మరోసారి తనలోని సత్తా చూపించటానికి సిద్దమవుతున్నారు. ఆయనకు సరైన కథ పడితే ఎలా ఉంటుందో ఈ విజయం నిరూపించబోతోంటూ ఈ చిత్రం గురించి చెప్పుతున్నారు. ఈ చిత్రంలో బాలయ్యలో రెండు కోణాలుంటాయని తెలుస్తోంది. అలాగే చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్.
వివరాల్లోకి వెళ్తే... బాలకృష్ణ హీరోగా ఇంకా పేరు పెట్టని ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తారు.
ఆ తరవాత వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే షూటింగ్ సాగుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి 'వారియర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సివుంది.

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.
ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











