twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ-బోయపాటి సినిమా అఫీషియల్ అనౌన్స్‌మ్మెంట్.. వివరాలు ఇవే!

    |

    టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన బాలకృష్ణ నుంచి సినిమా వస్తుంది అంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజిలో ఉంటాయి. దానికి బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తోడైతే అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.

    వీరి కాంబినేషన్లో హాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అభిమానుల ఆశ తీరబోతోంది. ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరు మరో భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ నిర్మాత ఖరారుకాక పోవడంతో ప్రాజెక్ట్ పెండింగులో పడింది. ఎట్టకేలకు ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

    భారీ బడ్జెట్ పెట్టేందుకు ముందుకు వచ్చిన నిర్మాత

    భారీ బడ్జెట్ పెట్టేందుకు ముందుకు వచ్చిన నిర్మాత

    ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించిన ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి బాలయ్య-బోయపాటి చిత్రానికి భారీగా ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చారు. బోయపాటి అభిరుచికి తిగిన విధంగా... ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా ఈ చిత్రం నిర్మించబోతున్నారు.

    కథ ఎలా ఉండబోతోంది అంటే...

    కథ ఎలా ఉండబోతోంది అంటే...

    బోయపాటి సినిమా అంటేనే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ మెండుగా ఉంటాయి. దీంతో పాటు స‌మాజంలో ఉండే ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ప్రస్తావన కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఈ రెండు అంశాల మేళవింపుతో అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది.

    షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

    షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..

    బాలయ్య కెరీర్లో 106వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2020 వేస‌వి చివ‌ర‌లో విడుద‌ల చేసేలా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

    బాలయ్య సరికొత్త లుక్

    బాలయ్య సరికొత్త లుక్

    దర్శకుడు బోయపాటి శ్రీను కంటెంటుపై ఎంత ఫోకస్ పెడతారో... హీరో లుక్ విషయంలో కూడా స్పెషల్ ఫోకస్ పెడతారు. మనం ఇప్పటి వరకు చూడని స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో బాలయ్యను చూపించబోతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

    English summary
    NBK 106 Announce. From the blockbuster combination of Simha and Legend, here comes the hat-trick combination. Nandamuri Balakrishna and Boyapati Sreenu to team up, Shoot starts from Dec 2019, Release for late summer 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X