130 కోట్ల భారతీయుల ఆశలు మోస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలపై పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రశంసల వర్షం
చంద్రుడిపై చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంపై పవన్ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ ప్రకటనను విడుదల చేస్తూ..
ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిదగిన విజయం. 130 కోట్ల మంది భారతీయ ఆశలను సజీవంగా మోస్తూ చంద్రయాన్ 3 ప్రయోగంలో విక్రమ్ లాండర్ చందమామపై సురక్షితంగా అడుగుపెట్టింది. భారత్ సాధిస్తున్న విజయపరంపరలో ఈ ప్రయోగం ముఖ్య ఘట్టం. ఇలాంటి విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలకు నా అభినందనులు. వారు సర్వాద అభినందనీయలు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

చంద్రయాన్ 3 ప్రయోగానికి అండదండలు అందించిన ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వానికి నా అభినందనలు అని తన ప్రకటనలో పవన్ కల్యాన్ తెలిపారు. చంద్రుని దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ను అడుగుపెట్టించి.. భారతీయలందరికి గర్వకారణం అయ్యారు. ఈ విజయంతో అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది అని పవన్ కల్యాణ్ అన్నారు.
చంద్రుని దక్షణ ధృవం పై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ముందడుగు వేసారు ఇస్తో శాస్త్రవేత్తలు. చంద్రుడుపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబందించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుంది అని బాలకృష్ణ అన్నారు.
ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించాలని కోరుకుంటున్నాను.140కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు మరోక్కసారి శుభాభినందనలు అని బాలకృష్ణ తన ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











