నయనతారపై కోపంగా ఉన్న బాలయ్య?

By Bojja Kumar

అగ్రహీరో బాలకృష్ణ నయనతారపై కోపంగా ఉన్నాడా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. అందుకు కారణం నయన తార ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమేనట. బాలయ్య చొరవ తీసుకోవడం వల్లనే శ్రీరామ రాజ్యం సినిమాలో నయన తారకు సీత పాత్ర చేసే అవకాశం దక్కింది. ఆ పాత్ర చేయడం ద్వారా ఎనలేని కీర్తి సంపాదించింది. సింహా సినిమాలో నయనతార తీరు, నటన ఎంతో నచ్చబట్టే బాలయ్య తర్వాతి సినిమా శ్రీరామ రాజ్యంలోనూ ఆమెను రికమండ్ చేసి సక్సెస్ అయ్యారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం మూడోసారి బాలయ్య నయన తారపై కన్నేశాడట. అధినాయకుడు తర్వాత తానే చేయబోయే సినిమాలో కూడా ఆమెనే తీసుకోవాలనే యోచనకు వచ్చాడని తెలుస్తోంది. ఈ మేరకు డేట్స్ కోసం నిర్మాతను పంపగా....రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట నయన తార. దీంతో ఖంగు తిన్న సదరు ప్రొడ్యూసర్ బాలయ్య దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పుకున్నాడట. దీంతో బాలయ్య నయనతార ప్రవర్తించిన తీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. తనతో నటించిన సింహ, శ్రీరామురాజ్యం సినిమాల వల్లనే ఫామ్ లోకి వచ్చిన నయన తార మరోసారి తనతో నటించడానికి రేటు పెంచడంపై బాలయ్య కోపంగా ఉన్నారని అంటున్నారు.

బాలయ్య కోపానికి ఓ కారణం ఉందంటున్నారు. సాధారణంగా నయన తార రెమ్యూనరేషన్ రూ. 50 లక్షల నుంచి 70 లక్షలకు మించి పోయేది కాదు. ఇప్పుడు అందుకు మూడు నాలుగు రెట్లు ఎక్కడ డిమాండ్ చేస్తుండటమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X