బాలయ్య విజిల్స్ వేసారు...
ఈ సినిమాని బాలకృష్ణగారు చూశారు. చూస్తున్నంతసేపూ విజిల్స్ వేస్తూనే ఉన్నారు. 'దంచవే మేనత్త కూతురా' పాటని బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పారు రమేష్ వర్మ. నాని, తనీష్ కథానాయకులుగా, అక్ష, శ్వేతాబసు ప్రసాద్ నాయికలుగా శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'రైడ్' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే రైడ్ కథకి ప్రేరణ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం చెపుతూ..'చిల్డ్రన్ ఆఫ్ హెవెన్' అనే ఇరానీ సినిమాలో ఇద్దరు అన్నాచెల్లెళ్లలో ఒకరి షూస్ పోతాయి.
ఆ సంగతి తెలిస్తే పెద్దవాళ్లు కోప్పడతారనే భయంతో ఆ సంగతి తెలీనీకుండా మిగిలిన జత షూలనే అన్నాచెల్లెలు ఇద్దరూ పంచుకుంటారు. అంటే ఉదయం పూట ఒకరు ఆ షూ వేసుకుంటే, సాయంత్రం మరొకరు వేసుకుంటారు. ఆ ప్రేరణతో ఒక బైక్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన స్ఫురించింది. దాని ఫలితమే 'రైడ్' కథ అన్నారు. ఇక బాలకృష్ణ, బెల్లంకొండ కాంబినేషన్లో రూపొందే భీష్మ చిత్రానికి రమేష్ వర్మనే దర్శకుడుగా ఎన్నుకున్నట్లు సమాచారం. రమేష్ వర్మ చెప్పిన స్టోరీ లైన్ బాలకృష్ణకు బాగా నచ్చటంతో ఆయన భీష్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. పోస్టర్స్ డిజైనర్ గా పాపులర్ అయిన రమేష్ వర్మ ఒక ఊరిలో సినిమాతో డైరక్టర్ గా తెరంగ్రేటం చేసాడు. అనంతరం సముద్ర దర్శకత్వంలో వచ్చిన మల్లెపూవు చిత్రానికి కథ అందించాడు. అది కూడా బరాన్ అనే ఇరాన్ చిత్రం కాపీ కావటం విశేషం.


Click it and Unblock the Notifications











