అంతరిక్ష యాత్రికుడిగా బాలకృష్ణ.. ‘టాప్’ లేపిన దర్శకుడితో బాలయ్య
Recommended Video

గౌతమి పుత్ర శాతకర్థి తర్వాత బాలకృష్ణ సినిమాల వేగం పెంచాడు. పైసా వసూల్‌తో దూసుకొచ్చిన బాలయ్య.. జై సింహాను కూడా పూర్తి చేశాడు. ఇక తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం పలు దర్శకులు చెబుతున్న కథలు వింటున్న బాలయ్య ఓ సెన్సేషన్ స్టోరికి ఓకే చెప్పారట.ఆ చిత్రానికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనున్నారనేది తాజా సమాచారం.

కృష్ణారెడ్డికి బాలయ్య గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్‌కు పలు సక్సెస్‌లను అందించిన ఎస్వీ కృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్యలో యమలీలకు సీక్వెల్ అందించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడటంతో చాలా జాగ్రత్త వహించాడు. ఇప్పుడు సరికొత్తగా కృష్ణారెడ్డి చెప్పిన
కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

గతంలో టాప్ హీరోగా బాలయ్య
బాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి కలిసి పనిచేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో వీరి కాంబినేషన్‌లో టాప్ హీరో అనే చిత్రం వచ్చింది. కానీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. తాజాగా కుదిరిన వీరి రేర్ కాంబినేషన్ సినీ వర్గాల్లో జోష్ పెంచాయి.

ఫాంటసీ చిత్రంలో బాలకృష్ణ
బాలకృష్ణ, కృష్ణారెడ్డి కలయికలో వచ్చే చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రంలో బాలకృష్ణ అంతరిక్ష యాత్రికుడిగా నటించనున్నారు. పూర్తిగా ఇది పాంటసీ చిత్రమనే విషయంలో వార్తల్లోకి ఎక్కింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

బోయపాటి శ్రీనుకు రెడ్ మార్క్
కాగా, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మహేశ్‌తో కలిసి బాలయ్య మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను బాలయ్య పక్కన పెట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోలో హీరోగానే సంచలనం రేపడానికి సిద్ధమవుతున్నారట.


Click it and Unblock the Notifications











