పాండురంగడు తర్వాత బాలయ్య యే సినిమా చెయ్యబోతున్నారనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. కానీ ముందు రాజమౌళి శిష్యుడు అయిన మహదేవన్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చటంతో అటు వైపై మొగ్గు చూపే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ సినిమా టైటిల్ 'క్షత్రియుడు' అని అంటున్నారు. గతంలో డబ్బింగ్ చిత్రం 'మన్మధ' ని అందించిన విజయభాస్కర రెడ్డి ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే బాలయ్య మీసాలు పెంచుతున్నట్లు అందరూ అనుకుంటున్నారు. శివాజీ గణేషన్ క్షత్రియపుత్రుడు చిత్రంలో మీసాల్లా అవి ఉన్నాయని అభిమానులు మురిసిపోతున్నారు. గెటప్ ఛేంజ్ చేసే ఈ చిత్రం బాలయ్యకు గత వైభవాన్ని తిరిగి తెస్తుందని అందరూ ఊహిస్తున్నారు. అది ప్రక్కనపెడితే మహదేవన్ దర్శకుడుగా డిసైడ్ అయితే...బాలకృష్ణనే నమ్ముకున్న బోయపాటి శ్రీను, గుణశేఖర్ పరిస్ధితి యేమిటన్నది తేలాలి. అమెరికా నుంచి వచ్చే బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.