twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: కేరళ బ్రాహ్మణుడుగా బాలకృష్ణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : మా చిత్రంలో బాలయ్య క్షత్రియ వంశానికి చెందిన వ్యక్తి. అయితే... కొన్ని కారణాలవల్ల కేరళలోని బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతాడు. చాలా శక్తిమంతమైన కథ. ఇప్పటివరకూ ఆయన ఇలాంటి నేపథ్యంలో సినిమా చేయలేదు అంటున్నారు దర్శకుడు జీవి. బాలకృష్ణతో తను చేయబోయే చిత్రం గురించి జీవి ఇలా వివరించాడు.

    అలాగే బాలయ్యబాబుకు నేను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఎంతబాగా నచ్చిందంటే... ఆ కథను తీసుకెళ్లి సింహాచలంలో పూజ చేయించుకొని తెచ్చారాయన. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. బహుశా బోయపాటి శ్రీను సినిమా తర్వాత ఆ సినిమా ఉండొచ్చు అన్నారు. ఇక నేనంటే బాలయ్యకు వాత్సల్యం. అందుకే కథ విన్నారు. అనుకోకుండా ఆయనకు నచ్చేసింది.

    ఇక ఇటీవలే ఓ కార్పొరేట్ కంపెనీతో టై అప్ అయ్యాం. ఆ వివరాలు త్వరలో చెబుతా. ఉత్తరప్రదేశ్, బీహార్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూపీ ఎమ్మెల్యేగా అమితాబ్ బచ్చన్ నటిస్తారు. బీహార్‌కి చెందిన ట్రేడ్ యూనియన్ లీడర్ పాత్రలో నానాపటేకర్ కనిపిస్తారు అని చెప్పారు. . స్వీయ దర్శకత్వంలో నేను నిర్మించిన 'రంగ ది దొంగ' చిత్రం నాకు పేరు తెచ్చిపెట్టింది. ఇక అమితాబ్‌ని డెరైక్ట్ చేయడం నిజంగా అనుకోని వరమే అన్నారు.

    ఇక నటుడుగానూ తన ప్రస్దానం కొనసాగుతుందంటూ జీవి చెప్తూ... ప్రస్తుతం నా చేతిలో ఓ డజనుకు పైగా సినిమాలున్నాయి. తెలుగులో ఎవడు, పొగ, చండి, తమిళంలో అజిత్ హీరోగా రూపొందనున్న సినిమా, కన్నడంలో దర్శన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ప్రతినాయకునిగా కీలకమైన పాత్రలు చేస్తున్నాను. ఇక హిందీ విషయానికొస్తే... షాహిద్‌కపూర్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతోన్న 'రెయిన్‌బో రాజ్‌కుమార్' చిత్రంలో ప్రధాన విలన్స్ లో ఒకరిగా నటిస్తున్నాను అన్నారు.

    English summary
    Balakrishna is currently busy acting in the direction of Boyapati Srinu. Latest buzz is that Balakrishna has given green signal to Actor turned director GV Sudhakar Naidu. He previously directed films like Hero and Ranga the Donga. Sources say that Balakrishna liked the powerful script readied by GV and has okayed the project. This film is expected to produce by a leading producer in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X