శక్తి వంతమైన ఓ వ్యక్తి గా నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణని అభిమానులు ఎలా చూడాలనుకొంటారో...అలాగే ఉంటుంది ఆయన పాత్ర. శక్తిమంతమైన ఓ వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరిస్తుందీ కథ. ఆ పాత్రలోని భిన్న పార్శ్వాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. బాలకృష్ణ ఆహార్యం, సంభాషణలు ప్రధాన ఆకర్షణలంటున్నారు బోయపాటి శీను. ఆయన దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న సింహా గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా యునైటెడ్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. పరుచూరి కిరీటి నిర్మాత. నయనతార, నమిత, స్నేహావుల్లాల్ నాయికలు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో నయనతార కనిపించనుంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ దేవాలయం సెట్‌ని నిర్మించారు. ప్రస్తుతం అక్కడే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో 'నేను మాట్లాడేటప్పుడు ఈ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేది పనిచేసిందో నీ నెక్ట్స్ బర్త్‌డే ఉండదు" వంటి పరవ్ ఫుల్ డైలాగులును బాలయ్య చెప్తూంటారు. ఇక ఈ చిత్రం మిగతా పాత్రల్లో కె.ఆర్.విజయ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్ (మలయాళం), ఆదిత్య మీనన్, శ్రావణ్, హేమంత్, జీవీ, బ్రహ్మానందం, అలీ తదితరులు కనిపించనున్నారు ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: ఆర్థర్.ఎ.విల్సన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.మహేంద్రబాబు.


Click it and Unblock the Notifications











