బాలయ్య పాండురంగడు లో కృష్ణుడు ఐతే పరమవీర చక్రలో రావణుడా..!
బాలయ్యతో చిత్రం చేసి పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న దాసరి...చిత్రం సంగతి పక్కన పెడితే..చిత్ర హీరో చిరకాల వాంఛలను తీర్చడానికి తను రాసుకున్న కథలో అనేక పాత్రలు పెట్టి..బాలయ్యకు సంతోషాన్ని కలిగిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి..అంతకుముందు మొదట్లోబాలయ్య కూడా దాసరితో సినిమా అనగానే వెనకాడిన విషయం తెలిసిందే. కానీ చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పలేక దాసరితో ఈ ప్రయోగాత్మక చిత్రానికి నాంది పలికిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్యకు చిత్రంపై, దాసిరి పై నమ్మకం కలగడానికి..బాలయ్య చరిత్ర తిరగేసి గతంలో బాలయ్య తెలిపిన ఇష్టాలను తెలుసుకుని మరీ అటువంటి పాత్రలు తన పరమవీర చక్రలో పెట్టేస్తున్నాడట..దాసరి.
ప్రస్తుతం వెలుగులోనికి వచ్చిన సమాచారం ప్రకారం..పరమవీరచక్రలో బాలయ్య రావణాసురిడి పాత్రను చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పాండురంగడు చిత్రంలో యన్టీఆర్ అంత కాకపోయినా దాదాపు శ్రీకృష్ణుడు పాత్రను పండించిన బాలయ్య రావణాసురిడి పాత్రకు ఏ మాత్రం న్యాయం చేస్తాడో తెలుసుకోవాలంటే..దాసరి ఈ చిత్రం పూర్తి చేసే వరకు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications











