డూప్ లేకుండా టీనేజ్ కుర్రాడిలా బాలకృష్ణ...
ఈ వయసులోనూ డూప్ లేకుండా టీనేజ్ కుర్రాడికి ఉండే ఎనర్జీతో యాక్షన్ సన్నివేశాలు చేశారు బాలయ్య. అలాగే ఆర్మీ మేజర్ జయసింహాగా, సినీ హీరో చక్రధర్‌గా ఆయన గొప్ప నటన ప్రదర్శించారు. సినీ హీరోగా వేసే అన్ని రకాల గెటప్పులలోనూ చాలా అందంగా కనిపిస్తారు. ఈ సినిమాలో బాలకృష్ణని చూస్తే..ఎన్టీఆర్‌ని తెరమీద చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ తన తాజా చిత్రం పరమవీర చక్ర గురించి చెప్పుకొచ్చారు నిర్మాత సి.కళ్యాణ్.
సంక్రాంతి రోజు విడుదల కానున్న ఈ చిత్రంపై బాలకృష్ణ అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఇదే విషయం ప్రస్తావిస్తూ...'సింహా' తర్వాత వస్తున్న, పైగా దాసరి-బాలయ్య తొలి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగా ఉంటాయని తెలుసు. ఆ అంచనాల్ని మించి ఉంటుంది ఈ సినిమా. 2010లో 'సింహా' ఎలా అతి పెద్ద హిట్టో 2011కు 'పరమవీరచక్ర' అంత పెద్ద హిట్టవుతుంది అన్మారు.
అలాగే పాటలుతో సహా 83 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. 400కు పైగా ప్రింట్లతో 12న సినిమాని విడుదల చేస్తున్నాం. తప్పకుండా దీనికి అవార్డులొస్తాయి. ఈ చిత్రంలో ఒళ్లు పులకరింపజేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మణిశర్మ ఇచ్చిన ఆడియో సూపర్‌హిట్. బాలయ్య సినిమా విడుదలకు ముందే ఆడియో ఇంత పెద్ద హిట్టవడం ఐదారేళ్ల తర్వాత ఇప్పుడే. గురువుగారు, బాలయ్య తొలి కాంబినేషన్ నా కోసమే మిగిలి ఉందనిపించింది. బాలయ్యతో ఫీలయిన సౌకర్యం మరే హీరోతోనూ ఫీలవలేదు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమిషా పటేల్, షీలా, నేహా ధూపియా కథానాయికలు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మురళీ మోహన్, విజయ కుమార్, ఆలీ, హేమ, సుధ ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో కనపించనున్నారు.


Click it and Unblock the Notifications











