బాలయ్య చెబితే చాలు..కన్ఫర్మే

By Staff

Balakrishna
బాలయ్యకు తెలుగు దేశం పార్టీలో డిమాండు రోజు రోజుకీ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు ఆశిస్తున్న వారంతా (అనేకమంది టీడీపీ నేతలు, నందమూరి వంశాభిమానులు) బాలయ్య ఇంటికి క్యూ కడుతున్నారు.ఇక కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే బాలయ్య చెబితే చాలు..కన్ఫర్మే అనే భావన నెలకొంది. వారంతా డైరక్టుగా చంద్రబాబు వద్దకు వెళ్ళి అడగడం,ఇతర ముఖ్యలును సంప్రదించటం, చంద్రబాబు సన్నిహితుల ద్వారా చెప్పించడంకు తోడు ఇప్పుడు బాలయ్యనూ ఓ మార్గంగా ఎంచుకున్నారు. టికెట్‌ ఆశిస్తున్న చాలామందిలో బాలయ్యకూ ఓ మాట అడిగి చూద్దాం అనే ధోరణి బాగా కనిపిస్తోంది.

కోస్తా..రాయలసీమ..తెలంగాణ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని నేతలూ హైదరాబాద్‌ వచ్చినప్పుడు పనిలో పనిగా బాలయ్య ఇంటికి వెళ్ళి కలసి వస్తున్నారు. కొంతమంది తమ నియోజకవర్గాల్లో బాలయ్యనే పోటీ చేయాలని కోరుతున్నారు.

ఆ లిష్టులో సీనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణ అభిమాన సంఘాల నేతలు మాత్రమే కాక టీడీపీ నేతలు కూడా ఉండటం విశేషం.మొదటి నుంచీ కృష్ణా నేతలతో సన్నిహితంగా మాట్లాడుతున్న బాలయ్య, ఇటీవల సినిమా షూటింగ్‌ కోసం గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ రెండు జిల్లాల నేతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.నిజానికి ఈ భేటీ పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉద్దేశించినదే అయినా...చాలా మంది నేతలు సీటు కోసం బాలయ్యకు విన్నపాలు అందిస్తున్నారు. అయితే అభిమాన సంఘాల నేతలు కొంతమందికి సీట్లు ఇప్పిస్తానని తొలి నుంచి చెబుతున్న బాలయ్య పార్టీ నేతల విషయంలో ఎంత వరకు జోక్యం చేసుకుంటారన్నది ప్రశ్నార్థకమే అని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X