బాలకృష్ణ చేతుల మీదుగా అల్లరి నరేష్ సినిమా..

By Srikanya

అల్లరి నరేష్ హీరోగా రూపొందే చిత్రం ప్రారంభానికి బాలకృష్ణ హాజరై ఆశీస్సులు అందించారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ సంస్ద నిర్మించే ఈ చిత్రం మలేషియాలో ప్రారంభమైంది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న పుత్రజయ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో 150 సంవత్సరాల తెలుగు వారోత్సవాలను పురస్కరించుకుని గుమిగూడిన 25 వేల మంది తెలుగువారి మధ్య ఈ సినిమా ప్రారంభమైంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బౌండ్ స్క్రిప్టును దర్శకనిర్మాతలకు అందజేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లరి నరేష్, పూర్ణ (తొలి పరిచయం) మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్‌నిచ్చారు. నిర్మాత కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్బంగా హీరో నరేష్ మాట్లాడుతూ..."సిద్ధు ఫ్రమ్ సికాకుళం తర్వాత మరలా ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.ఎగ్జిక్యూటివ్ నిర్మాత అమ్మిరాజు మాట్లాడుతూ "ఈ భారీ కామెడీ చిత్రం ఈ నెల 11 నుంచి 16 వరకు హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం మూడు షెడ్యూళ్ళలో చిత్రాన్ని పూర్తి చేస్తాం'' అని చెప్పారు.ఇక నిర్మాతలు ఇంతకుముందు 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం', 'సీతారాముల కల్యాణం లంకలో' వంటి చిత్రాలను నిర్మించారు. బ్రహ్మానందం, జయప్రకాష్, సాయాజీ షిండే, ఎమ్.ఎస్.నారాయణ, ఎల్బీ శ్రీరామ్, నాగినీడు, జీవా, వెన్నెల కిషోర్, రావు రమేష్, రవి, ప్రకాష్, ప్రభు, సుధ, సురేఖావాణి, మీనా కుమారి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కళ: కె.వి.సుబ్బారావు, కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X