బాపు మళ్లీ పుట్టాలి..రంజిప చేయాలి: బాలయ్య (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, దివంగత చిత్రకారుడు బాపును స్మిరంచుకుంటూ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో.....బాపు ఫిల్మ్ ఫెస్ట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి నందమూరి నట సింహం బాలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
బాపుగారు మళ్లీ పుట్టాలని, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను రంజింప చేయాలనీ బాలయ్య ఆకాంక్షించారు. బాపు చివరి సినిమా ‘శ్రీ రామ రాజ్యం'లో బాలకృష్ణ హీరోగా నటించారు. ‘శ్రీ రామ రాజ్యం' వంటి గొప్ప సినిమాను నాకు అందించినందుకు ఎప్పటికీ బాపు గారికి రుణపడి ఉంటాను అని చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్రదర్శనను బాలయ్య తిలకించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

బాలయ్య
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభలో బాపు గురించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న బాలయ్య.

మళ్లీ...
బాపుగారు మళ్లీ పుట్టాలని, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను రంజింప చేయాలనీ బాలయ్య ఆకాంక్షించారు.

అభిమానికానుక
బాలయ్యకు ఆయన అభిమాని ఒకరు ఇలా చిరు కానుక అందజేసారు.

పేయింటింగ్స్
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పేయింటింగ్స్ పరిశీలిస్తున్న బాలయ్య


Click it and Unblock the Notifications











