బాలయ్య నేతృత్వంలో సినీ తారల ర్యాలీ

By Bojja Kumar

కేన్సర్ వ్యాధిపై చైతన్యం తెచ్చేందుకు తెలుగు సినీ తారలు నడుబిగించారు. ఈ రోజు కేన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ నటుడు బాలయ్య నేతృత్వంలో బసవ తారకం కేన్సర్ ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వరకు కేన్సర్ అవేర్ నెస్ వాక్ నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ....కేన్సర్ ను నిర్మూలించాలంటే ముందు ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలని, ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు. తొలి దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా నయం చేయడం సులభం అన్నారు. ఈ ర్యాలీలో బాలయ్యతో పాటు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపచంద్, నటులు మురళీ మోహన్, రాజశేఖర్, అలీ, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X