ప్రేక్షకులు ఆశీర్వదిస్తే...సత్తా చాటుతా: బాలయ్య
శ్రీరామ రాజ్యం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, తనను ఆశీర్వదిస్తే...మరిన్ని పౌరాణిక సినిమాలు తీసి నాన్న నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతానని బాలకృష్ణ అన్నారు. శ్రీరామ రాజ్యం సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం రేడియో మిర్చి98.3 లో వ్యాఖ్యాత అవతారం ఎత్తిన బాలకృష్ణ శ్రోతలను అలరించారు. శ్రీరాముడి పరిపాలన విలవలు, ఆనాటి కుటుంబ బాంధవ్యాలు నేటి తరానికి గుర్తు చేయడానికే శ్రీరామరాజ్యం సినిమాను చేసినట్లు తెలిపారు. దర్శకులు బాపు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. తెలుగు వినాలంటే రమణ, తెలుగు చూడాలంటే బాపు...శ్రీరామరాజ్యం రచయిత, దర్శకులను తనదైన శౌలిలో పొగడ్తలతో ముంచెత్తారు.
తన తండ్రి నటించిన శ్రీకృష్ణ పాండవీయం, నర్తనశాల, సీతారామ కల్యాణం సినిమాలను రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. నర్తనశాల సినిమాను రీమేక్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.
ఇక పోతే...బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం ఈ నెల 17న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు సినిమా సెన్సార్ బోర్డు పర్యవేక్షణకు వెళ్లింది. బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇలయరాజా సంగీతం అదించారు. బాలయ్య సరసన సీత పాత్రలో నయనతార నటించింది.


Click it and Unblock the Notifications











