»   » సింగర్లు, యాంకర్లతో హీరో బాలకృష్ణ డాన్స్ (ఫోటోలు)

సింగర్లు, యాంకర్లతో హీరో బాలకృష్ణ డాన్స్ (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  దుబాయ్: ప్రముఖ తెలుగు హీరో బాలకృష్ణ దుబాయ్‌లో జరిగిన ఓ కల్చరల్ కార్యక్రమంలో ఆడి పాడి సందడి చేసారు. దుబాయ్ లో నెలకొల్పబడ్డ తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ 'రసమయి' ఆధ్వర్యంలో స్పందన అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. బాలకృష్ణ నడిపిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నిధుల సేకరణలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు.

  దుబాయ్‌లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 3000లకు పైగా బాలకృష్ణ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సింగర్లు, యాంకర్లతో ఆడి పాడి సందడి చేసారు. అభిమానుల చప్పట్లు, కోలాహలంతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.

  ఈ కార్యక్రమంలో తెలుగు స్టార్స్ బోయపాటి శ్రీను, అలీ, నిర్మాత అంబిక కృష్ణ, సింగర్స్ టీం మాళవిక, శ్రీకృష్ణ, సింహా, కౌశల్య, కామెడీ టీం జబర్దస్త్ ఫేం మహేష్, గాలిపటాల సుధాకర్‌లతో యాంకర్ రష్మి, హీరోయిన్ కామ్నా జఠ్మలానీ తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన పోటోలు స్లైడ్ షోలో....

  బాలకృష్ణ డాన్స్

  బాలకృష్ణ డాన్స్


  యాంకర్లు, సింగర్లతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న బాలకృష్ణ. స్పందన పేరుతో ‘రసమయి' సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22న దుబాయ్‌లో జరిగింది.

  కామ్నా జఠ్మలానీతో...

  కామ్నా జఠ్మలానీతో...


  హీరోయిన్ కామ్నా జఠ్మలానీతో కలిసి డాన్స్ చేస్తున్న బాలకృష్ణ. పక్కనే జబర్దస్త్ యాంకర్ రష్మి. పాటలు పాడుతున్న సింగర్ మాళవిక, కౌసల్య

  రష్మితో జోష్‌గా

  రష్మితో జోష్‌గా


  జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మితో కలిసి జోష్‌గా స్టెప్పులేస్తున్న బాలకృష్ణ. రష్మితో బాలకృష్ణ డాన్స్ చేస్తుంటే అభిమానులు చప్పట్లు, విజిల్స్‌తో సందడి చేసారు.

  సాంప్రదాయ నృత్యం

  సాంప్రదాయ నృత్యం


  ఈ షోలో సినిమా స్టార్లు, సినిమా పాటలతో పాటు....సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

   పూలతో స్వాగతం

  పూలతో స్వాగతం

  ఈ కార్యక్రమ నిర్వాహకులు బాలకృష్ణకు పూలతో స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

  జ్ఞాపికల ప్రధానం

  జ్ఞాపికల ప్రధానం

  ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్లు, ఇతర కళాకారులకు జ్ఞాపికలు అందజేస్తున్న బాలకృష్ణ. బాలయ్య చేతుల మీదుగా జ్ఞాపికను అందుకుంటున్న సింగర్ మాళవిక.

  బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం

  బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం

  బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి కోసం 40000 అమెరికా డాలర్ల చెక్కును అందజేస్తున్న నిర్వాహకులు.

  ప్రారంభోత్సవం...

  ప్రారంభోత్సవం...

  రసమయి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న బాలకృష్ణ.

  స్పందన

  స్పందన

  రసమయి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పందన' కార్యక్రమానికి దబాయ్ లోని తెలుగు వారి నుండి మంచి స్పందన వచ్చింది.

  బాలకృష్ణకు సన్మానం

  బాలకృష్ణకు సన్మానం

  స్పందన కార్యక్రమం సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కోసం బాలయ్య చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ బాలయ్యకు సన్మానం చేస్తున్న దృశ్యం.

  English summary
  
 Rasamayi is a 28year old Telugu Cultural Organization in Dubai and have conducted RASAMAYI - SPANDANA, 'An Evening with the LEGEND' with Nandamuri Balakrishna as Chief guest in Sheikh Rashid Auditorium, Dubai for supporting Basavatarakam Cancer Hospital and Research Institute, Hyderabad.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more