ఎప్పుడైనా.. ఎక్కడైనా.. దేనికైనా రెడీ : బాలకృష్ణ

By Srikanya

హైదరాబాద్ : 'మా నటీనటులకు వయసుతో పని లేదు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. దేనికైనా రెడీ'.. అన్నారు నందమూరి బాలకృష్ణ . 'హిందూ ధర్మం-ప్రవేశిక' (తెలుగు), హిందూఇజం ఏ ప్రీమియర్‌ (ఆంగ్లం) గ్రంథాల ఆవిష్కరణ సభ రవీంద్రభారతి వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన బాలకృష్ణ ఈ విధంగా స్పందించారు. అలాగే 'వేదాల నుంచి పుట్టిందే ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడుకోవా లి. ఈ పుస్తకం హిందువులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. పోటీ ప్రపంచంలో హైందవ ధర్మాన్ని మరిచిపోతున్నాం. అద్భుతమైన హైందవ ధర్మాన్ని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది'అని అన్నారు.

ఇక తాజాగా బాలకృష్ణ మరో చిత్రం కమిటయ్యారు. 'శ్రీమన్నారాయణ' చిత్రం ప్లాప్ కావటంతో బాలకృష్ణ ఆచి తూచి అడుగులు వేయబోతున్నారు. త్వరలో బాలకృష్ణ మరో భారీ చిత్రం చేయబోతున్నాడు. 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాసు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ రచన చేస్తున్నారు. వీరిద్దరు మహేష్ నటించిన హిట్ చిత్రం 'దూకుడు'కు స్క్రిప్ట్ అందించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్తపంథాలో ఈ చిత్ర కథ ఉంటుందని కోన వెంకట్ తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో తెలిపాడు.

ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...'నేను, గోపీ మోహన్ తొలి సారిగా బాలయ్య సినిమాకు కలిసి పని చేయబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు. ఈచిత్రాన్ని కొత్త నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీ మోహన్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్లుగా కొనసాగుతున్నారు. ఇద్దరు కలిసి పని చేసిన దూకుడు, కింగ్ చిత్రాల్లో పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు బాగా పేలాయి. ప్రస్తుతం వీరు జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రంతో పాటు, మంచు విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ', వెంకీ 'షాడో' చిత్రాలకు పని చేస్తున్నారు.

బాలయ్య త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాబోయే సినిమాలో చేబోతున్నట్లు తెలుస్తోంది. సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో తన గత సినిమా 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందబోతున్న 'ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X