బాలయ్య కోసం స్పెషల్ షో వేసారు, ఇక హిట్టే...
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘వారాహి చలన చిత్రం' బ్యానర్ కు మంచి పేరుంది. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాదు, ఈ బ్యానర్లో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తాజాగా ఈ బ్యానర్లో వస్తున్నమరో చిత్రం ‘తుంగభద్ర'. తాజాగా బాలయ్య కోసం ఈ చిత్రం స్పెషల్ షో వేసారు.
నందమూరి బాలకృష్ణకు, వారాహి అధినేత సాయికొర్రపాటితో మంచి అనుబంధం ఉంది. ఈ మార్చి 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్‌లో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తోన్న చిత్రం 'తుంగభద్ర' విడుదలవుతుంది. ఈ సందర్బంగా ఆదివారం నందమూరి బాలకృష్ణ ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్రయూనిట్‌ను అభినందించారు.

బాలయ్యకు స్పెషల్ షో చూపిస్తే సినిమా హిట్టవుతుందనే సెంటిమెంటు కూడా మొదలయింది. ఈ నేపథ్యంలో ‘తుంగభద్ర' చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిర్మాతలు స్టార్ట్స్‌ను నమ్మి వరుసగా సినిమాలు చేస్తుంటారు. కానీ నిర్మాత సాయి కొర్రపాటి స్టైలే వేరు. ఆయన కథను నమ్మి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు.
గత సంవత్సరం స్టార్ హీరో బాలకృష్ణతో లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఆయన తాజాగా తుంగభద్ర అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గోగినేని శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ద్వారా అదిత్ హీరోగా పరిచయం అవుతున్నారు. రొమాన్స్ ఫేం డింపుల్ చోపడా హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ యాక్టర్ సత్యరాజ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన లవ్‌స్టోరీగా తుంగభద్ర తెరకెక్కింది. ఈ లవ్‌స్టోరీ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











