బాలయ్య 60.. ఆ రోజు నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్!
నందమూరి బాలకృష్ణ మరోసారి కెరీర్ లో వరుస అపజయాలను చూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఒక హిట్టు సినిమా తీస్తే మళ్ళీ వెంటనే ఆయన వరుస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో మాస్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్స్ అనంతరం రూలర్ కూడా దెబ్బకొట్టడంతో ఈ సారి మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
అయితే జనరేషన్ ఎంత మారుతున్నా కూడా బాలకృష్ణ తన స్టైల్ ని మార్చడం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా కొత్త కంటెంట్ తో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే రచయిత సాయి మాధవ్ బుర్ర ఫుల్ స్క్రిప్ట్ ని పూర్తి చేయగా బి.గోపాల్ మేకింగ్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు.

అయితే ఆ ప్రాజెక్ట్ ని ఈపాటికే మొదలు పెట్టాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే త్వరలో బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. జూన్ 10న బాలయ్య బాబు 60వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నారట. బి.గోపాల్ తో బాలకృష్ణ సినిమా చివరగా పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా చేశాడు. ఇక 17 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











