వైసీపీ లీడర్ నుంచి BB3 డైలాగ్ కాపీ కొట్టేసిన బాలయ్య.. ఆ నేతకు కౌంటర్ ఇవ్వడానికే..
నందమూరి బాలకృష్ణ ప్రతి సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు సీరియస్ డైలాగ్స్ కూడా ఉండాల్సిందే. నేటితరం హీరోలు ఎంత మారుతున్న కూడా బాలయ్యా డైలాగ్ డెలివరీలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆభిమానులకు ఆయన డైలాగ్స్ ఏ మాత్రం బోర్ కొట్టవని వారి హంగామా చూస్తేనే అర్ధమవుతుంది. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన డైలాగ్ కూడా అభిమానులకు మంచి కిక్కిస్తోంది. అయితే ఆ డైలాగ్ వైకాపా పార్టీ నేత నుంచే కాపీ కొట్టినట్లు తెలిసిపోయింది.
Recommended Video
బిర్త్ డే టీజర్..
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రోర్ టీజర్ ఆడియెన్స్ అంచనాలను మరింత పెంచేసింది.

ఆ డైలాగ్ కాపీ కొట్టేశారు..
ఎదుటివాడితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో. శ్రీను గారు మీ నాన్న బాగున్నారా ? అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా? అనడానికి చాలా తేడా ఉంటుందిరా లండీకొడకా.. అంటు బాలకృష్ణ చెప్పిన డైలాగ్. ఆడియెన్స్ చేత విజిల్స్ వెయిస్తున్నాడు. అయితే ఈ డైలాగ్ ని బాలకృష్ణ కాపీ కొట్టడమే కాకుండా ఒక వైసీపీ నేతకు కౌంటర్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఆయనదే ఈ డైలాగ్..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైకాపా నేత, ప్రస్తుత మినిష్టర్ పెర్నేని నాని ప్రతిపక్ష నాయకులన్న మాటలకు ఇదే తరహాలో వివరణ ఇచ్చారు. ఎదుటివారు మాట్లాడే పద్ధతి బట్టి మన ఆన్సార్ ఉంటుందని ఇంటికొచ్చి మీ నాన్న గారు ఉన్నారా అని అడిగితే బావుంటుంది.. అంతే గాని ని అమ్మ మొగుడు ఉన్నాడా అంటే..ఎలా ఉంటుంది అని ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

వైసీపీ నేతకు కౌంటర్
అమ్మ మొగుడు అనే పదం ఎక్కువగా ఎవరు వాడుతుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అధికార పార్టీలో తరచూ ఒక లీడర్ వాడుతూ ఉంటారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఆ డైలాగ్ ని అతనికి కౌంటర్ గా వాడెయ్యడం హాట్ టాపిక్ గా మారింది అనే టాక్ వస్తోంది. గతంలో కూడా బాలకృష్ణ పార్టీలో లీడర్ల జంపింగ్ లపై కూడా లెజెండ్ లో కౌంటర్ వేసే విధంగా ఒక ఎపిసోడ్ ని క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ తన నెక్స్ట్ సినిమాలో ఈ విధంగా కౌంటర్ ఇవ్వడం చూస్తుంటే సినిమాలో ఇంకా కుప్పలుకుప్పలుగా దాచారేమో అని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











