Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్యా నీ స్థాయి...అదికాదయ్యా....!
యువరత్నబాలకృష్ణ 'సింహా" విజయాత్సాహంతో సింహా యాత్ర మొదలు పెట్టి టి20 టాలీవుడ్ మాచ్ ప్రాక్టీస్ తో మరింత ఉత్సాహాంగా కనిపిస్తున్నారు. ఇదొక్కటే కాదు టాలీవుడ్ లో ఏ కార్యక్రమం జరిగినా అందరితో కలివిడిగా ఆయన ముందుంటారు. నందమూరి బాలకృష్ణ కల్మషం లేనివాడు అని పరిశ్రమ వర్గాలు అంటాయి. ఉదాహరణకు తను ఏదైనా బాధ్యతను స్వీకరిస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించేంత వరకూ నిద్రపోడు. చిరంజీవి సినిమాలు వదిలి రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత బాలకృష్ణ అందరితోనూ మంచి మార్క్స్ కొట్టేశారు.
బాలకృష్ణ చాలా ఉత్సాహంగా అప్పుడు వరదబాధితుల కొరకు స్పందన కార్యక్రమం విజయవంతం చేశారు. ఇప్పుడు పేదకళాకారుల కొరుకు టి20 అంటూ ముందుకు రావడం, ఆయన ప్రాక్టీస్ ల్లో ఉత్సాహంగా పాల్గొనడం చూసి బాలయ్యలోని ఈ సేవాగుణం కనిపెట్టిన ఇండస్ట్రీ వర్గాలు 'మా" అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని ట్రై చేస్తున్నారట. ఇందుకు ప్రస్తుత అద్యక్షుడు మురళీ మోహన్ కూడా సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య కూడా నాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. కానీ అతని అభిమానులకు మాత్రం బాలయ్య వ్యవహారం నచ్చలేదట. బాలయ్యా నీ స్థాయి ఇది కాదయ్యా..నువ్వు ఇంకా గొప్ప పదవులు చేపట్టాలి. రాష్ట్రానికే ముఖ్యమంత్రికావాల్సినవాడివి. ఇలాంటి చిన్న పదవులు చేపట్టవద్దని బాలయ్యకు హితబోధ చేయాలనుకుంటున్నారట.